‘పోకిరి’ ఇండస్ట్రి హిట్ అవ్వడానికి అసలు కారణాలు ఇవే !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కి సూపర్ స్టార్ అనే స్టార్ డామ్ తీసుకు వచ్చింది ‘పోకిరి’. అంతకుముందు వరకు ప్రిన్స్ అని పిలువబడే మహేష్.. పోకిరి హిట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు గా మారాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ టాలీవుడ్ ఇండస్ట్రీలో 75 సంవత్సరాల సినిమా రికార్డులన్నింటినీ పగలగొట్టింది. 2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తారీఖున రిలీజ్ అయి ఇప్పటికి 14 సంవత్సరాలు కావస్తున్న క్రమంలో సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అప్పట్లో 100,200,500 చివరికి వెయ్యి రోజులు కూడా ప్రదర్శించబడింది.Mahesh Babu's 'Pokiri' completes 12 years | Telugu Movie News ...‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అవడానికి గల కారణాలు చూస్తే పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్ లు. సినిమాలో  పూరి టేకింగ్ కి ఎన్నడూ లేని విధంగా మాస్ పర్ఫామెన్స్ లో అదరగొట్టేశాడు మహేష్ బాబు. ఫైట్స్ విషయంలో గాని పాటల విషయంలో గాని ‘పోకిరి’ ఆల్ టైం హిట్ అని చెప్పవచ్చు. మణిశర్మ అందించిన సినిమా పాటలు అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించాయి. దాదాపు అన్ని సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ‘పోకిరి’లో మహేష్ బాబు నటించిన నటన అంతకుముందు సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా మహేష్ నటన చాలామందిని అప్పట్లో ఆకట్టుకుంది.

 

ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ కి సినిమా హాల్లో అయితే సీట్లలో కూర్చున్న ప్రేక్షకుల్ని పూరి జగన్నాథ్ నుంచో పెట్టాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతవరకు సినిమా ఒకటైతే చివరిలో క్లైమాక్స్ సీన్ నాజర్ చనిపోయిన టైములో మహేష్ అంబాసిడర్ కారు దిగి పరిగెత్తడమే సినిమాకి హైలెట్. ఈ సినిమాలో మహేష్ బాబు మేనరిజం మరియు బాడీ లాంగ్వేజ్ అల్టిమేట్ అని చెప్పవచ్చు. చిన్నపిల్లలు మరియు యూత్ తెగ ఫాలో అయ్యారు. ముఖ్యంగా మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి  తీసుకెళ్ళింది. హీరోయిన్ ఇలియానా అందాలు కూడా సినిమాలో  ఎంతగానో ఆకట్టుకుంటాయి. అన్ని విధాల సినిమా బాగుండటంతో 75 ఏళ్ల టాలీవుడ్ సినిమా రికార్డులు మొత్తం పగలగొట్టిన సినిమాగా ‘పోకిరి’ చరిత్ర సృష్టించింది. 

Read more RELATED
Recommended to you

Latest news