కాలు విరగొట్టుకున్న పూజా హెగ్డే.. ఆందోళనలో ఫ్యాన్స్… అసలు ఏమైంది?

-

తమిళ సినిమా ‘ముగముడి’ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది.

- Advertisement -

ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశే మిగిల్చాయి. వరుస డిజాస్టర్స్ పడినా పూజాకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన బుట్టబొమ్మ ఓ సినిమా చేస్తోంది.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే.. నిత్యం తన ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ షైనింగ్ డ్రెస్‌లో హొయలు పోయారు. ఆమె అందానికి ఫాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇన్​స్టాలో తను తాజాగా చేసిన పోస్ట్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. తన కాలు విరగొట్టుకున్న ఫోటోను ఇన్​స్టాలో షేర్​ చేసింది. ఇక ఆ ఫోటోలో కాలికి కట్టునట్టు ఉంది. దానికి ఓకేదేన్​.. అని రాసుకొచ్చింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. బుట్ట బోమ్మ కాలికి గాయం కావడంతో… అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. కొంత మందికి పూజా ఐరెన్​లెగ్​కు ఏమైందీ.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదీ ఏమైనా పూజా హెగ్డే త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...