ఈ హీరో రోమాన్స్ లో కింగ్ అంటూ పూజ ట్వీట్…!

-

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కాస్త బోల్డ్ గా మాట్లాడటం అనేది అలవాటు చేసుకున్నారు. తమకు ఎం చెప్పాలని ఉంటే అది చెప్పేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కొందరు హీరోయిన్లు ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. దీనితో ఫాన్స్ కూడా వాళ్ళు ఎప్పుడు ఎం మాట్లాడతారా…? అని ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా ఫాలోయింగ్ కోసం కష్టపడుతున్నారు హీరోయిన్లు.

ఇప్పుడు ఈ బాటలో పూజ హెగ్డే కూడా పయనిస్తుంది. ఈ మధ్య అమ్మడు ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది పూజ. తాజాగా ఓ నెటిజన్ ప్రశ్న అడుగుతూ.. మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు? అని అడగగా పూజా దానికి సమాధానం ఇస్తూ… షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ అని తెలిపింది. మరో ప్రశ్నకు సమాదానంగా తన అభిమాన గాయకుడు ఎ ఆర్ రెహమాన్ అని తెలిపింది.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. రోమాన్స్ అంత బాగా చేసావా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉండగా షారుక్ కి వయసు మీద పడినా సరే నీ లాంటి వాళ్ళను ఇంకా ఫిదా చేస్తున్నాడు కచ్చితంగా కింగ్ అయి ఉంటాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. షారుక్ కి అసలు ఈ విషయంలో పోటీనే లేదని ఆమె కామెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news