సంచలన కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!

-

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో  ఒక వార్త బాగా హల్చల్  చేస్తోంది. కాని దానిలో నిజం లేదని , అందంతా మీడియా వండుకున్న మసాలా మాత్రమే అని దీనికి కారణం అయిన ఆమె తేల్చేసింది.టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన పూనమ్ కౌర్.. ఇటీవల సోషల్ మీడియాలోలో షేర్ చేసిన ఓ ఫోటోపై అందరూ తలో రకంగా కామెంట్స్ చేసారు. కర్వాచౌత్ శుభాకాంక్షలు చెబుతూ గురువారం రాత్రి పూనమ్ ఓ ఫోటో సోషల్ మీడియాలో పెట్టింది.

కర్వాచౌత్ పండుగలో తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు వుండాలని పూజలు చేస్తారు. ఆ రోజు మొత్తం ఏమి తినకుండా ఉండి  రాత్రి సమయంలో జల్లెడ నుంచి చంద్రుడిని చూసి.. ఆపై భర్త ముఖాన్ని చూస్తారు. అయితే ఇలాంటి ఫోటో పూనమ్ పెట్టేసరికి తనకి పెళ్లి అయ్యిందని ప్రచారం మొదలు పెట్టారు. దీనిపై పూనమ్ ట్విట్టర్లో కోపంగా సమధానం ఇచ్చింది. నామీద ఎవరో చెడు ప్రచారం చేయాలని బాగా కోరుకుంటున్నారని మండి పడింది. అలాగే కర్వాచౌత్ పండుగను పెళ్లైన మహిళలే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ కాబోయే భర్తల కోసం పూజలు చేసి , పండుగ జరుపుకుంటారని తెలిపింది.

అలాగే  ప్రేమలో ఉన్నవారు, ఎంగేజ్ మెంట్ అయిన వారు సైతం తమకు కాబోయే భర్త కోసం  కర్వాచౌత్ సందర్భంగా పూజలు చేస్తారు. కాకపోతే పెళ్ళైన మహిళలు చంద్రుడిని చూస్తే.. పెళ్లికాని అమ్మాయిలు మాత్రం చంద్రునికి బదులుగా చుక్కలను చూసి నమస్కారం చేసుకుంటారని క్లారిటీగా చెప్పింది. దీనితో రెండు రోజులుగా హడావుడి చేసిన బ్యాచ్ హంగామా మొత్తం చప్పున చల్లారి పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news