ప్రభాస్ పాపులారిటీకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.

-

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఒకదాని వెంట ఒకటి వరుసగా ఉండడంతో చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణ జరుగుతుంది. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయ్యింది గానీ, లేదంటే ఈ పాటికి థియేటర్లలోకి వచ్చేసేదే. ఆరున్నర నెలల తర్వాత మళ్ళీ మొదలైన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యూరప్ ప్రాంత నేపథ్యంలో సాగే కథ కాబట్టి ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ జరుపుతున్నారు. ఈ మేరకు ఇటీవలే ఇటలీ పయనమయ్యారు.

ఇటలీలో షెడ్యూల్ పూర్తవగానే హైదరాబాద్ లో చిత్రీకరణ ఉంటుందట. ఐతే ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుతున్న రాధేశ్యామ్ సినిమాపై అక్కడి మీడియా కవరేజి ఇచ్చింది. సాధారణంగా ఇటలీలో ఎన్నో షూటింగ్ లు జరుగుతాయి. కానీ ప్రభాస్ కి ఉన్న పాపులారిటీయే వీరు. బాహుబలి తో ప్రపంచానికంతా పరిచయమయ్యాడు. అందుకే ఇటలీ లోకల్ మీడియా రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పై కవరేజి ఇచ్చింది. పాన్ వరల్డ్ సినిమాకి సిద్ధం అవుతున్న ప్రభాస్ కి ఈ మేర పాపులారిటీ చాలా అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news