ప్రభాస్ సాహోకి అక్కడ కూడా నిరాశే ఎదురయ్యిందిగా..!

-

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్, ఆ తర్వాత సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఐతే తెలుగులో నిరాశ పరిచిన సాహో, బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దక్షిణాదిన ఫ్లాప్ టాక్ వస్తే, ఉత్తరాదిన మాత్రం హిట్ టాక్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

దాంతో ప్రభాస్ రేంజ్ ఉత్తరాదిన ఎలా ఉందో అందరికీ తెలిసొచ్చింది. అదలా ఉంచితే, తాజాగా సాహో సినిమా టెలివిజన్‌లో ప్రసారమైంది. ఈ మధ్య పాపులర్ హీరోల సినిమాలకి వచ్చే రేటింగులు కూడా రికార్డులుగా చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే సాహో సినిమాకి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. తెలుగులో ప్రసారమైన సాహో చిత్రానికి 5.8రేటింగ్స్ రావడం ఆశ్చర్యంగా ఉంది. అటు వెండితెర మీద తిరస్కరించిన ప్రేక్షకులు బుల్లితెర మీద కూడా తిరస్కరించారనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news