బాహుబలి సినిమా రాజమౌళికి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో అంతకుమించి ఆ సినిమాలో నటించిన ప్రభాస్ ను నేషనల్ స్టార్ హీరోగా చేసింది. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో సాహో సినిమా సౌత్‌లో ప్లాప్ అయినా నార్త్‌లో ఎంత బ్లాక్బస్టర్ హిట్ అయిందో చూశాం. తాజాగా బాహుబలి సినిమాను లండన్ లో ప్రదర్శించిన తర్వాత ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ స్థాయిలో తెలుగుసినిమా ఖ్యాతిని నిలబెట్టిన బాహుబలితో తెలుగుసినిమా ఖ్యాతి పెరిగిందా అన్న ప్రశ్నకు ప్రభాస్ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.
తెలుగు సినిమా మేకింగ్ ను ఒక కొత్త ఒరవడి లో తీసుకువెళ్లిన సినిమాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాకి చెందుతుందని… శివ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి మార్చిందని చెప్పిన ప్రభాస్… శివ సినిమా వచ్చిన 30 సంవత్సరాల తర్వాత బాహుబలి మరో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చెబుతూ బాహుబలి… శివ సినిమాల మధ్య కంపేరిజన్ చేయడం చాలామందికి షాకింగ్ గా మారింది. వాస్తవానికి శివ సినిమా ఒక ట్రెండ్ సెట్ మూవీ అన్న విషయంలో ఎవరికీ సందేహాలు లేవు.
అయితే ఆ సినిమా అంతర్జాతీయ వేదికలో ప్రదర్శించబడే లేదు. బడ్జెట్ విషయంలో శివ సినిమాకు బాహుబలి సినిమాకు చాలా తేడాలు ఉన్నాయి. బాహుబలి తీసిన రాజమౌళి కి వెంటనే పద్మశ్రీ పురస్కారం లభిస్తే.. శివ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మకు జాతీయస్థాయిలో ఇలాంటి పురస్కారాలు రాలేదు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అందరికీ తెలిసిందే. అంతెందుకు సాహో సినిమా రిలీజ్ కు ముందు వర్మ.. ప్రభాస్ తన కులానికి చెందిన వాడని అందుకే సాహో సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని తాను కోరుకుంటున్నానని ఓపెన్‌గానే చెప్పాడు.
ఇప్పుడు ప్రభాస్ కూడా వర్మకు రాజమౌళికి పోలిక పెడుతూ మాట్లాడడంతో బాహుబలి కంటే శివే ముందు తెలుగు సినిమా స్థాయిని పెంచిందని చెప్పడం రాజమౌళిని హర్ట్ చేసేలా ఉందన్న కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ ఏ ఉద్దేశంతో చెప్పాడని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.