12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా..

12 ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్‌  ఇక్కడకు చేరుకున్నారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

ప్రభాస్‌ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ‘రెబల్‌స్టార్‌.. రెబల్‌స్టార్‌’ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సుమారు లక్షమంది అభిమానుల కోసం ప్రభాస్‌ టీమ్‌ భోజన ఏర్పాట్లు చేసింది.  2010లో  తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో సంతాప కార్యక్రమాల కోసం ప్రభాస్‌ మొగల్తూరులో వారం రోజులు పాటు ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఆయన ఇప్పుడే వచ్చారు.