ప్రభాస్ ‘సలార్’ కథ లీక్..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ కాంబినేషన్‌పై చర్చ జరుగుతుంది. ఇప్పుడు సలార్ లో కూడా అలాంటి కథనే చెప్పబోతున్నాడు ప్రశాంత్ నీల్. తన మార్క్ మరోసారి చూపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించనంత పవర్ ఫుల్ గా చూపించాలని ఫిక్స్ అయిపోయాడు ప్రశాంత్ నీల్.

prabhas
prabhas

అప్పట్లో ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ను లీడర్ గా చూపించి సంచలనం రేపాడు రాజమౌళి. ఛత్రపతి సినిమాకు ముందు వరకు కూడా ప్రభాస్ కేవలం ఓ హీరో మాత్రమే. ఆయనకు వర్షం లాంటి విజయం వచ్చినా కూడా మాస్ ఇమేజ్ మాత్రం రాలేదు. కోరుకున్న మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు. ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్ అలాంటి సంచలనాత్మక కథను తెరపైకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాడు. సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం. అంటే మళ్లీ అదే.. వెనకాల ఉండేవాడు నాయకుడు ఎలా అయ్యాడు అని. ఇప్పుడు ఈ సినిమా నేపథ్యం ఏంటో బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్ గా కనిపిస్తాడని ప్రశాంత్ నీల్ తెలిపాడు. అయితే అలాంటి నాయకుడు ఎందుకయ్యాడు.. ఎలా అయ్యాడు.. కావాల్సిన పరిస్థితులు ఏంటి అనేది మిగిలిన కథ.

అంతేకాదు సలార్ లో రివెంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ రివెంజ్ ను ముంబై మాఫియాతో లింక్ పెడుతున్నాడు ప్రశాంత్ నీల్. కేజియఫ్ లో కూడా ముంబై పేరు వినిపిస్తుంది. ఇప్పుడు సలార్ కోసం కూడా అలాంటి కథనే సిద్ధం చేసాడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం వచ్చే జనవరి నుంచి మొదలు కానుంది. కేజియఫ్ సినిమాలా కాకుండా వీలైనంత త్వరగా సలార్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్.

Read more RELATED
Recommended to you

Latest news