డబుల్‌ ప్రాఫిట్స్‌ తీసుకుంటోన్న ప్రభాస్..ఆ సినిమాకు వంద కోట్లు

ప్రభాస్‌ కూడా బ్యాంక్‌ బ్యాలెన్స్‌పై ఫోకస్ పెడుతున్నాడు. ఇన్నాళ్లు నార్త్‌లో స్టార్డమ్ పెంచుకోవడానికి ప్రయత్నించిన ప్రభాస్, ఇప్పుడీ స్టార్డమ్‌ని క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాడు. శాలరీ కమ్ షేరింగ్‌ బేసిస్‌లో ఇన్‌కమ్‌ పెంచుకుంటున్నాడు బాహుబలి.

ప్రభాస్‌ బాలీవుడ్‌కి వెళ్లాక ఫుల్‌ కమర్షియల్‌గా ఆలోచిస్తున్నాడట. తెలుగులో ఉన్నన్ని రోజులు మార్కెట్‌ పెంచుకోవడానికి ప్రయత్నించిన ప్రభాస్, బాలీవుడ్‌కి వెళ్లాక బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెంచుకునే స్కీములేస్తున్నాడట. ఫస్ట్‌ టైమ్‌ నార్త్‌ బ్యానర్‌లో చేస్తోన్న ‘ఆదిపురుష్’కి డబుల్‌ ఇన్‌కమ్ అందుకుంటున్నాడట ప్రభాస్. బాలీవుడ్‌ మేకర్ ఓమ్ రౌత్‌ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా టీ-సీరీస్‌తో కలిసి ప్రభాస్‌తో ‘ఆది పురుష్’ తీస్తున్నాడు. ఈ సినిమాకి ప్రభాస్‌ భారీగా రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక రెమ్యూనరేషన్‌తో పాటు బిజినెస్‌ అయ్యాక ప్రాఫిట్స్‌లో షేర్ కూడా తీసుకోబోతున్నాడని టాక్ వస్తోంది.

ప్రభాస్‌ ప్రీవియస్‌ మూవీ ‘సాహో’కి 70 కోట్ల వరకు తీసుకున్నాడని టాలీవుడ్‌ టాక్. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌తో పాటు ప్రాఫిట్స్‌లో షేర్‌ కూడా తీసుకుంటున్నాడని చెప్తున్నారు. అంటే ‘ఆది పురుష్’కి ప్రభాస్‌ 100 కోట్ల వరకు అందుకుంటున్నాడని చెప్పొచ్చు. సో తెలుగు హీరోల్లో ఇంతమొత్తం అందుకుంటోన్న మొదటి హీరోగా ప్రభాస్‌ కొత్త రికార్డ్‌ సెట్‌ చేస్తున్నాడనే చెప్పాలి.