బ్లాక్ డ్రెస్ లో అందాల నిధి తెరిచేసిన ప్రగ్యా జైస్వాల్..!

-

కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్య జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కంచె లో ఈమె నటనకు గాను ఉత్తమ మహిళ డెబ్యూ సౌత్ తరఫున ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.ఆరంభం లో పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత గ్లామర్ గేట్లు తెరిచేయడంలో అడ్డు చెప్పలేదు.. కానీ ఆశించిన అవకాశాలు మాత్రం దక్కలేదనే చెప్పాలి.. నిరంతరం సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉండే ఈమె వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ బికినీలో ప్రజ్ఞ టూ హాట్ గా కనిపిస్తోందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక షోల్డర్ నుంచి పూర్తిగా డ్రస్ వైదొలగడంతో టాప్ లెస్ లుక్కులో మెరిసింది. ఇక ఆసక్తికరంగా ఈ బికినీ లుక్కుకి ఫుల్ స్లీవ్స్ ని జోడించి డిజైనర్ క్రియేటివిటీని మరో లెవెల్ లో చూపించారు.. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజల్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా హాట్ గా ఉన్నారు అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు కంచె తెంచిన అందం అంటూ పొగిడేస్తున్నారు.. అంతేకాదు ఈమె అందం చూసి యువత కవులుగా మారుతున్నారడంలో సందేహం లేదు.

ఇకపోతే నమో వెంకటేశాయ, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాలలో నటించి మెప్పించ లేకపోయినా ఆమె అఖండ సినిమాలో నటించి భారీ విజయం అందుకుంది. ఇక గత సంవత్సరం విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం సన్నాఫ్ ఇండియాలో చివరిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దాంతో అవకాశాలు కూడా కనుమరుగయ్యాయని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Read more RELATED
Recommended to you

Latest news