అగ్నివీర్‌లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌

-

అగ్నివీర్‌లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీర్​లకు రైల్వేలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15% రిజర్వేషన్‌ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేహదారుఢ్య పరీక్షల నుంచి కూడా వారికి మినహాయింపు ఉంటుందట. దివ్యాంగులు (పర్సన్‌ విత్‌ బెంచ్‌మార్క్‌ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్‌ అప్రంటీస్‌ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్‌-1లో 10%, లెవెల్‌-2.. అంతకుమించిన నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్‌ను అగ్నివీర్‌లకు కల్పిస్తారు.

తొలిబ్యాచ్‌ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు. నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్‌ మేనేజర్లకు రైల్వేబోర్డు లేఖలు పంపింది. భర్తీ కాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది. అగ్నివీర్‌ల కోసం రిజర్వేషన్‌ విధానాన్ని ఆర్‌పీఎఫ్‌ కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news