ప్రకాష్ రాజ్ మళ్లీ సూపర్ పంచ్ వేశారు గా..!!

-

నటుడు ప్రకాష్ రాజ్  వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ ఆయన ఎంట్రీ ఇస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాల మీద, ఆ పార్టీ నాయకుల మీద , హిందుత్వ అజెండా రాజకీయాల మీద ఆయన వంటి కాలి మీద లేస్తూ ఉంటారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమా పఠాన్ సినిమా మంచి వసూళ్ల తో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే.

అయితే గతంలో  పఠాన్ సినిమా లో దీపిక పదుకొనె   సాంగ్ పై సోషల్ మీడియాలో హిందుత్వ నెటిజన్లు చెలరేగి పోతున్న  సమయంలో ప్రకాష్ రాజ్ సినిమాకు అండగా నిలిచారు సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రకాష్ రాజ్  ట్విట్టర్ లో.. భేషరమ్ బిగోట్స్.. కాషాయం ధరించిన స్వామీజీలు మైనర్లని అత్యాచారం చేసినప్పుడు పట్టించుకోరు. అలాంటి స్వామీజీ లు, నాయకులు పబ్లిక్ గా తిరగొచ్చు.. అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దీపికా పదుకొనె సినిమాలో కాస్ట్యూమ్ ధరించినప్పుడు మాత్రమే మీకు ఇబ్బందా ? అంటూ దీపికా కు సపోర్ట్ గా నిలిచారు.

ఇప్పుడు ఈ సినిమా విజయం తో  బాగా ఆనందం లో ఉన్నాడు. ఇన్నాళ్లకు టైమ్ వచ్చింది అంటూ కౌంటర్ స్టార్ట్ చేసాడు. మళ్లీ ప్రకాష్ రాజ్  సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ హేయ్, బాయ్కాట్ బిగొట్స్ ష్ ష్, హాల్లా భోల్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ చెప్పుకొచ్చారు. కీప్ రాకింగ్ దీపికా పదుకునే, జాన్ అబ్రహం అండ్ టీమ్ పఠాన్ అని అన్నారు. ఈ పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఆయన విజయవంతం గా తాను అనుకున్న వారిపై పంచ్ వేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news