పట్టు చీరలో మెరిసిపోతున్న ప్రణీత సుభాష్.. ఫోటోలు వైరల్..!

-

ప్రణీత సుభాష్.. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఇండస్ట్రీలో తన అందచందాలతో.. కంటి చూపుతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రణీత సుభాష్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. రహస్యంగా పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈమె తల్లి అయిన తర్వాత అందాల విషయంలో జోరు మరింత పెంచిందని చెప్పాలి. ఇకపోతే సోషల్ మీడియాలో రకరకాల దుస్తులు ధరించి వరుస ఫోటోషూట్లతో అభిమానులకు మంచి విజువల్ ట్రీట్ అందించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పట్టు చీర కట్టుకొని ఏంజెల్లా మెరిసిపోయింది. ఇక లైట్ పింక్ కలర్ పట్టు చీర కట్టుకున్న ఈమె ఒంటినిండా సిల్వర్ కలర్ నగలు ధరించి మరింతగా దగదగా మెరిసిపోతూ తన అందాన్ని రెట్టింపు చేసుకుంది.

ఇందులో మూడు డిఫరెంట్ ఫోటోలను పంచుకోగా.. ఒక ఫంక్షన్ లో పేరెంట్స్ మధ్యలో కూర్చున్నట్టుగా.. మరొకటి క్లోజప్ షాట్లో.. స్టన్నింగ్ లుక్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. చాలాకాలం తర్వాత ఇలా ఒక ఫంక్షన్ లో దిగిన ఫోటోలను ప్రణీత షేర్ చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ప్రణీత అందానికి ప్రతి ఒక్కరు మోహితులవుతున్నారని చెప్పవచ్చు.

మొన్నటి వరకు గ్లామర్ షో చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ఇలా ఒక్కసారిగా పట్టుచీరలో కనిపించేసరికి ఈమె అందాలు చూసి ప్రతి ఒక్కరూ మోహితులవుతున్నారని చెప్పాలి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే తెలుగులో ఆఫర్లు లేకపోయినా కన్నడ, తమిళ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈమె కన్నడలో బాగానే ఆఫర్లను అందుకుంటుంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే మరొకవైపు సెకండ్ హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

Read more RELATED
Recommended to you

Latest news