‘కెజిఎఫ్’ డైరెక్టర్ మహేష్ తోనా, ఎన్టీఆర్ తోనా.??….అసలు మ్యాటర్ ఇది….!!

-

గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1. కన్నడనాట ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాను పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో హీరోగా రాక్ స్టార్ యాష్ నటించగా, యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహించారు. యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తొలిసారి హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమా సూపర్ గా సక్సెస్ అవడంతో, ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్ 2 ని చిత్రీకరిస్తోంది సినిమా యూనిట్. ఇక చాప్టర్ 1లో కొన్ని క్షణాలు మాత్రం తళుక్కుమని మెరిసిన అధీరా పాత్ర చాప్టర్ 2లో ఎంతో కీలకం కానుంది. ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కాగా ఆయనతో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న ఈ సినిమాను రాబోయే వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మన తెలుగు హీరోలైన ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు లో ఒకరితో వర్క్ చేయనున్నారని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఎన్టీఆర్ తో చేస్తారని అంటుంటే, మరికొందరు మాత్రం మహేష్ తోనే ఆయన సినిమా ఖాయమైందని అంటున్నారు. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ప్రశాంత్ తదుపరి సినిమా మహేష్ తోనే ఫిక్స్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా ఉందట. అలానే ఆ సినిమా కథను కూడా ప్రశాంత్ సిద్ధం చేసి,
ఎన్టీఆర్ కి కూడా వినిపించడం జరిగిందట. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో హీరోగా నటిస్తుండడం, ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తికాకపోవడంతో, ఈలోపు ప్రశాంత్ సూవ్ర్ స్టార్ మహేష్ తో వర్క్ చేయడానికి సిద్దమయ్యారట. అందులో భాగంగా ఇటీవల మహేష్ ని కలిసిన ప్రశాంత్, ఆయనకు ఒక మంచి స్టోరీ వినిపించి ఒప్పించడం కూడా జరిగిందట. అయితే మహేష్ త్వరలో ఒక మూడు నెలలు బ్రేక్ తీసుకునే సమయంలో ప్రశాంత్ దాని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తారని, అలానే తన కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఏప్రిల్ సమయానికి పూర్తి అవగానే, వెనువెంటనే మహేష్ తో సినిమాని ప్రారంభిస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news