ఫ్యాక్ట్ చెక్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ప్రియాంక, నిక్ జన్మనిచ్చిన బిడ్డవేనా..?

అందాల తార ప్రియాంక చోప్రా మరియు నిక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని చెప్పారు. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ మరింత ఆనందంగా ఉన్నారు. ఈ జంట తమ మొదట బిడ్డకి జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సరోగసీ పద్ధతి ద్వారా మొదటి బిడ్డ జన్మించింది. 39 ఏళ్ల నటి సరోగసీ పద్ధతి ద్వారా తన మొదటి బిడ్డని కన్నారు. నిక్ మరియు ప్రియాంక బిడ్డ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ జంటకి ఆడబిడ్డ పుట్టిందా లేదా మగ బిడ్డనా అన్నది చెప్పలేదు.

అయితే కొన్ని రిపోర్టు ప్రకారం చూసుకున్నట్లయితే ఆడపిల్లలా తెలుస్తోంది. తాజాగా బిడ్డని పట్టుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మా మొదటి బిడ్డ అని షేర్ చేశారు. అయితే ఆ ఫోటో ని చూస్తే అది నిక్ వాళ్ళ మేనకోడలి ఫోటో అని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

పైగా అప్పుడే పుట్టిన బిడ్డ ఫోటో కాదు అది. ఈ ఫోటో 2018 నాటిది. మరొక ఫోటో లో అయితే రెస్టారెంట్ లో ప్రియాంక చోప్రా బిడ్డతో ఉన్నారు. అది ప్రియాంక చోప్రా ఫ్యామిలీ లో ఒక చిన్న పిల్ల ఫోటో. అయితే ఈ జంట ఇంకా వాళ్ళ బిడ్డ ఫోటోని షేర్ చేయలేదు.

అయితే ప్రియాంకచోప్రా బిడ్డ 12 వారాల ముందే జన్మించినట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ప్రియాంక తాజాగా సోషల్ మీడియా లో మేము మొదటి బిడ్డకి జన్మనిచ్చాము. ఈ సమయంలో ప్రైవసీ కావాలని అనుకుంటున్నాము అని అన్నారు.