సినిమా జర్నలిస్ట్‌కి వార్నింగ్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు !

-

తనపై లేనిపోనివి రాస్తే తాటతీస్తానంటూ నిర్మాత దిల్ రాజు మీడియాను నిన్న హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ సినీ పాత్రికేయుడిపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ‘పిచ్చిపిచ్చిగా రాస్తే వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నావు?’ అంటూ ఆయన మండిపడటం అందులో కనిపిస్తుంది. తనను ఆపడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపైన రాజు ఫైర్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారని మీడియా, వెబ్‌ సైట్లపై నిన్న ఫైర్‌ అయ్యారు దిల్‌ రాజ్‌. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను… మీ వైబ్ సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తానని హెచ్చరించారు దిల్ రాజు. చిరంజీవి నిన్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి..నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తానని హెచ్చరించారు. వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు…ఈ రోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news