పూజా హెగ్డేపై నిర్మాత దిల్ రాజ్ హాట్ కామెంట్స్ !

-

దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా బీస్ట్‌. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని.. ఏప్రిల్‌ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే.. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లోనే విడుదల కానున్న నేపథ్యంలో.. నిన్న హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా దిల్‌ రాజు.. పూజా హెగ్డేపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. పూజా.. మన కాజా అంటూ పేర్కొన్నారు. దీంతో ఆడియోన్స్‌ అరుపులతో హోరెత్తించారు. అంతటితో ఆగకుండా.. ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌ గా అంటూ దిల్ రాజు.. లేపేశాడు. ఆమె లెగ్గు పడితే సూపర్‌ హిట్టే అంటూ బుట్ట బొమ్మని ఆకాశానికి ఎత్తేశాడు. పూజా దిల్‌ రాజు బ్యానర్‌ ల బన్నీతో డీజే చేసింది. అలాగే.. మహిర్షి, అరవింద సమేత, అలా వైకుంఠ పురములో పూజా నటించి.. మంచి విజయాలు అందుకుంది. అలా వైకుంఠ పురములో మూవీతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news