ఖర్జూరాన్ని ఈ విధంగా వాడుకుంటే.. బోలెడు లాభాలు

-

నాచురల్ స్వీట్ పండులో కర్జూరం ఒకటి.. ఇంతకుముందు రోజుల్లో ఖర్జూరం సీజనల్ గానే ఉండేది. నిల్వచేసుకోవడానికి వీలు ఉండేది కాదు. ఎండు ఖర్జూరం అయితే సంవత్సరం పొడవునా వాడుకునేవారు.. కానీ ఇప్పుడు అన్నీ కాలాల్లో.. ఖర్జూరం దొరుకుతుంది. పంచదార, బెల్లం వాడటం బదులుగా.. వాటి స్థానంలో ఖర్జూరం వాడుకోవచ్చు. అయితే ఎలా వాడాలో అందరికీ పెద్దగా తెలియదు. ఈరోజు మనం వీటివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి.. ఎట్లా ఉపయోగించుకోవాలో చూద్దాం..

పండు ఖర్జూరాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే..

ఖర్జూరం ఎక్కువగా తీసుకున్నప్పుడు గింజ తీసేసి స్టోర్ చేసుకోవాలి. గింజ ఉంటే.. త్వరగా పురుగుపడుతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే గింజతో ఉన్నా ఎలాంటి సమస్యా ఉండదు. బయట మార్కెట్ లో దిరికే డబ్బాల్లో కాకుండా.. హోల్ సేల్ గా..అమ్మే దగ్గర ఖర్జూరం తీసుకుంటే.. చవకగా వస్తుంది. ఇంటిపక్కనవాళ్లో.. ఫ్యామిలీ మెంబర్స్ కలిపి తీసుకుని షేర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొచ్చి పెట్టుకుంటే.. మార్నింగ్ స్ప్రౌట్స్ తినేప్పుడు ఖర్జూరం కూడా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ తో పాటు తినొచ్చు.

ఖర్జూరాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేస్తే.. పేస్ట్ లా వస్తుంది. ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని.. పులుసుకూరల్లో, జ్యూసుల్లో వేసుకోవడానికి బాగా పనికొస్తుంది. అంటే కొంతమంది.. పులుసు వంటల్లో పంచదార లేదా బెల్లం వాడుతుంటారు కదా.. ఆ టైంలో ఈ పేస్ట్ వేసుకోవచ్చు.

నువ్వుల ఉండలు, వేరుశనగపప్పు ఉండలు, కొబ్బరి ఉండలు, పుట్నాలపప్పు ఉండలు చేసేప్పుడు కూడా ఖర్జూరం పేస్ట్ వేసి చేసుకోవచ్చు.

ఎండుఖర్జూరం ఎలా వాడాలంటే..

ఎండుఖర్జూరం ఇంట్లో పెట్టుకుంటే.. చిన్నపిల్లలకు డైలీ 5-10 చొప్పున ఇవ్వొచ్చు. ఇవి అయితే పురుగుపడే అవకాశం ఉండదు. ఎండుఖర్జూరం గింజలు తీసేసి.. ఖర్జూరాన్ని నాలుగు ఐదు రోజులు పాటు బాగా ఎండపెట్టండి. అలా ఎండిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పొడి వస్తుంది. దాన్ని జల్లిస్తే…. బరకగా వచ్చింది.. మళ్లీ ఆ బరకను రెండు రోజులు ఎండపెట్టి గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గంధంలా పొడి వస్తుంది. దీన్ని స్టోర్ చేసుకుని.. పాలల్లో, జ్యూసుల్లో, స్వీట్లు తయారు చేసేప్పుడు అన్నింటిలో వాడుకోవచ్చు. నాచురల్ స్వీట్ గా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు డైలీ పంచదార వేసి పాలు ఇస్తుంటారు.. అది మానేసి ఈ పొడి వేసి పాలు ఇస్తే.. ఇమ్యునిటీ పవర్ పెరిగి.. జ్వరాలు, జలుబులు రాకుండా ఉంటాయి.

ఈ ఖర్జూరం పొడి 6 నెలలు నుంచి సంవత్సరం వరకు అయినా సరే పురుగుపట్టకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా చెడిపోదు.

అందరి ఇళ్లలో ఖర్జూరం పైన చెప్పిన మూడు వేరియంట్లలో.. పండు, పేస్ట్, పొడి ఉంటే.. ఏది ఎప్పుడు కావాలంటే.. అప్పుడు వాడుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ ఖర్జూరం వాడాలంటే.. ఎండుఖర్జూరం అయితే రోజుకు రెండు మూడు తినొచ్చు.. ఖర్జూరం పండు అయినా రెండు మూడు తినొచ్చు. రోజులో ఏదైనా ఒక్కటే తినాలి. వీళ్లు ఎక్కువ ఖర్జూరం తింటే.. త్వరగా రక్తంలోకి వెళ్లి..ఎక్కువ చెక్కరను ఇస్తాయి కాబట్టి.. వెయిట్ పెరిగే రిస్క్ ఉంటుంది. మిగిలినవారు అయితే ఎలాంటి సందేహం లేకుండా ఖర్జూరం వాడొచ్చు.. ముఖ్యంగా దగ్గులు, కఫాలు, శ్లేష్మాలు, ఆస్తమా, ఎప్పుడు తమ్ములొచ్చేవారు, ట్రైగ్లిజరేయిడ్స్ కొలెస్ట్రాల్ ఉన్నవారందరూ.. పంచదార, బెల్లం మానేసి.. ఖర్జూరాన్ని వాడుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

-Triveni Buskarwothu

Read more RELATED
Recommended to you

Latest news