పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ హీరోగా ‘మనుచరిత్ర’

-

ఇప్పటి వరకు మనం కమల్ హాసన్ మరోచరిత్ర చూశాం. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కమల్ హాసన్ సినీ కెరీర్ లోనే ఆ సినిమా ఓ మలుపు. అప్పటి జనరేషన్ సినిమా అది. అయితే.. నేటి జనరేషన్ కు అనుగుణంగా తెలుగులో మనుచరిత్ర అనే సినిమా రాబోతుంది. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా వస్తున్న సినిమా ఇది.

నితిన్ సరసన లై, చల్ మోహన్ రంగా అనే సినిమాల్లో నటించిన మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు భరత్ కుమార్ పెదగోని డైరెక్టర్. ఆయన ఇదివరకు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ప్రకాశ్ రాజ్ ప్రొడక్షన్స్ లో కొన్ని సినిమాలు, ఇటీవల సూపర్ డూపర్ హిట్ అయిన ఆర్ఎక్స్ 100 కు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈసినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఈసినిమా లాంచింగ్ ఇవాళ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా.. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా ఫస్ట్ సీన్ ను షూట్ చేశారు. కెమెరాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ సుధీర్ వర్మ, ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. సినిమా స్క్రిప్ట్ ను మనుచరిత్ర డైరెక్టర్ భరత్ కుమార్ కు అందించారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా షూటింగ్ ఉండనున్నట్లు డైరెక్టర్ భరత్ కుమార్ మీడియాకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news