సాయి ధ‌ర‌మ్ తేజ్ రిస్క్ చేస్తుండా?

-

వ‌రుస‌గా ఆరు ఫ్లాప్‌(తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌, ఇంట‌లిజెంట్‌, తేజ్ ఐ ల‌వ్యూ)ల‌ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల చిత్ర‌ల‌హ‌రితో విజ‌యాన్ని అందుకున్నారు. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా నిజానికి యావ‌రేజ్. కానీ కావాల‌ని హిట్ చేశారు. ఈ సినిమా కూడా పోతే సాయితేజ్ కెరీర్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డుతుంద‌ని భావించిన చిత్ర బృందం, ఇండస్ట్రీ వ‌ర్గాలు, మెగా ఫ్యామిలీ ప‌నిగ‌ట్టుకుని స‌క్సెస్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రి సాయి చిత్ర‌ల‌హ‌రి హిట్‌ని కొన‌సాగిస్తాడా? లేడా ? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. ఎందుకంటే సాయి తేజ్ నెక్ట్స్ సినిమా మారుతితో చేసేందుకు రెడీ అవుతున్నారు.

Maruthi to direct Sai Dharam Tej

యూవీ క్రియేష‌న్స్ తో క‌లిసి జీఏ2లో ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. గ‌తంలో హ్యూమ‌న్ వీక్ నెస్ ఆధారంగా మారుతి రూపొందించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు వంటి సినిమాలు బాగా ఆడాయి. వెంక‌టేష్‌తో చేసిన బాబు బంగారం ఫెయిల్ అయ్యింది. దీంతోపాటు ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌తో చేసిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు సైతం స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. ఇవ‌న్నీ మూస ధోర‌ణి క‌థ‌లు కావ‌డంతో జ‌నం రిజ‌క్ట్ చేశారు.

ఈ నేప‌థ్యంలో ఓ ఫెయిల్యూర్ ద‌ర్శ‌కుడితో సాయి తేజ్ సినిమా చేయ‌బోతుంద‌టం హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు రాక రాక వ‌చ్చిన హిట్‌ని నిలబెట్టుకుంటూ బ‌ల‌మైన కంటెంట్ తో కూడిన సినిమాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. మారుతి అలాంటి సినిమాని ఇవ్వ‌గ‌ల‌డా? చాలా వ‌ర‌కు వీక్‌నెస్ ల నుంచి క‌థ‌ని అల్లుకుని సినిమాలు తీసే మారుతి ఆ స్ట‌యిల్‌ క‌థ‌ల‌ను ఇప్పుడు ఆడియెన్స్ ఆద‌రిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఒక ఫార్ములాని న‌మ్ముకుంటే ఒక‌టి, మ‌హా అయితే రెండు సినిమాలు వ‌ర్కౌట్ అవుతాయి. వ‌రుస‌గా అదే పంథాలో వెళితే జ‌నానికి బోర్ కొట్ట‌క త‌ప్ప‌దు. మ‌రి అలాంటి ప‌రిస్థితిలో మారుతి మ‌ళ్ళీ వాటితోనే మ్యాజిక్ చేస్తాడా? అది కాకుండా ఈ సారి కొత్త క‌థ‌లో సాయితేజ్‌ని చూపిస్తాడా? మారుతితో సినిమా అంటే సాయి రిస్క్ చేస్తున్నాడా? అన్న‌ది మున్ముందు తెలుస్తుంది. ఇక‌ అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ సినిమా జూన్‌లో ప‌ట్టాలెక్క‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news