ఊరించి… ఉసూరుమనిపించిన “ప్రాజెక్ట్ K” అప్డేట్… !

-

ప్రభాస్ హీరోగా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ “ప్రాజెక్ట్ కె”. ఇప్పటికే వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నాడు. ఇందులో ప్రభాస్ పాత్ర తన కెరీర్ కె హైలైట్ గా నిలవనుంది అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఇందులో ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్ , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ లాంటి నటీనటులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దీపికా పదుకునే లుక్ ఎలా ఉండనుంది అన్నది చిత్ర బృందం అప్డేట్ ను రిలీజ్ చేస్తుంది అన్న అప్డేట్ ను మధ్యాహ్నమే విడుదల చేశారు. కానీ చిత్ర బృందం అనౌన్స్ చేసిన సమయానికి ముందుగా తెలిపిన ప్రకారం దీపికా పదుకునే లుక్ ను విడుదల చేయడంలో ఫెయిల్ అయింది. ఈమె లుక్ కోసం ఎంతగానో ఎదరుచూసిన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. ఈ అప్డేట్ కొన్ని సాంకేతిక కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నది చిత్ర బృందం వివరణ. ఇక ఈమె ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అన్నది త్వరలోనే తెలియచేస్తారు.

ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక కెప్టెన్ అఫ్ థిస్ ప్రాజెక్ట్ కే ఈజ్ మిస్టర్ నాగ్ అశ్విన్.

Read more RELATED
Recommended to you

Latest news