వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `పూరి మ్యూజిగ్స్ పేరుతో ఈ మధ్య ఆడియో వాయస్‌లని, తనదైన స్టైల్ ఎనాలసిస్‌లని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ఆడియో టేప్‌ని వదిలారు. ఇందులో ఫ్లాప్ సినిమాలపై తన థియేరీని విడుదల చేశారు. ఇందులో రివ్యూవర్స్‌పై సుతిమెత్తగా విమర్శించారు. ఇండస్ట్రీకి కాపాడండి కానీ ఫ్లాప్ ప్రొడ్యూసర్‌లని, డైరెక్టర్‌లని టార్గెట్ చేయకండి అంటూ ఫ్లాప్ మూవీస్‌పై పెద్ద లెక్చరే ఇచ్చారు. `ఫ్లాప్ మూవీస్.. ఫ్లాప్‌ని ఎవ్వరూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ తీయరు. ఏడాదిలో రెండు వందల సినిమాలు వస్తే అందులో హిట్‌లు.. బ్లాక్ బస్టర్‌లు కలిపి పదే వుంటాయన్నారు.
మిగిలినవి నూట తొంబై ఫ్లాపులే. జీవితాంతం ఈ ఫ్లాపుల్ని చూడలేక వాటిని ఎనలైజ్ చేయలేక జర్నలిస్టులకు తిక్కలేసి రివ్యూలతో వాయించేస్తున్నారు. ఎందుకంటే అన్ని సినిమాలు అలాగే ఏడుస్తున్నాయ్. రివ్యూల దెబ్బకి ప్రొడ్యూర్‌లు ఇండస్ట్రీ వదిలిలేసి పోతున్నారు. ఫ్లాప్ దర్శకులు నిర్మాతల వల్లే ఇండస్ట్రీ బతుకుతోంది. ఇక్కడ అన్నం పెట్టేది కూడా వాళ్లే. ఫ్లాప్ సినిమయాల వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోంది. అలాంటి ఫ్లాప్ సినిమాలకు అండగా నిలవాల్సిన అవసరం వుంది.
రివ్యూస్ రాసే అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. మీరు కాపాడాల్సింది ఫ్లాప్ సినిమాల్ని. బ్లాక్ బస్టర్ సినిమాలకు మీ అవసరం లేదు. ఇక్కడ ఎవరూ జీనియస్ కాదు. తెలిసో తెలియకో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫ్లాప్ తీసి వుండవచ్చు . కానీ వారి వల్ల కొంత మందికి తిండి తొరుకుతోంది. వాళ్లు బుర్ర తక్కువ వాళ్లే కావచ్చు. కానీ వాటికి రేటింగ్ ఒకటి ఇవ్వాలనిపిస్తే రెండు.. రెండు ఇవ్వాలనిపిస్తే మూడు ఇవ్వండి.. దాని వల్ల శాటిలైట్ బిజినెస్ అయి చాలా కుటుంబాలు బ్రతుకుతాయి` అన్నారు పూరి.