సూపర్ స్టార్ మహేష్ బాబు- డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన `పోకిరి` అప్పట్లో ఇండస్ర్టీ రికార్డు. ఆ హిట్ తో మహేష్ మేనియా పీక్స్ కు చేరుకుంది. అటుపై వచ్చిన బిజినెస్ మెన్ ఓ సంచలనం. మహేష్ కు ప్రత్యేకమైన ఐడెంటీ తీసుకొచ్చిన చిత్రమది. కానీ ఈ రెండు సక్సెస్ లను మరిచిన మహేష్ పూరికి ప్లాప్ ల్లో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదు. మహేష్ ను దృష్టిలో పెట్టుకుని జనగణమణ కథని ఎంతో ఇష్టపడి రాసుకున్నాడు. మహేష్ తో తెరకెక్కిస్తున్నట్లు గర్వంగా ప్రకటించాడు. కానీ పూరి ప్లాప్ లను లెక్కలేసి పక్కనబెట్టాడు. సక్సెస్ ల్లో ఉన్న డైరెక్టర్లను చూజ్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయంలో మహేష్ పై పూరి అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేసారు.
అయితే తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వూలో పూరి ఓ మాట అన్నాడు. సినిమా హిట్ అయితే ప్రతీ ఒక్కరూ జీనియస్ ల్లా కనిపిస్తారు… సినిమా ఆడకపోతే జీనియ్ కూడా వెదవ అయిపోతాడని పూరి స్టైల్లో అన్నాడు. ఆ పంచ్ విన్నప్పుడే తనమీద తానే సెటైర్ వేసుకున్నాడనుకున్నారు. పైగా ఇప్పటివరకూ ఏ ఇంటర్వూలో పూరి ఇలా మాట్లాంది లేదు. అయితే అసలు విషయం ఏంటంటే? పూరి ఆ మాట అనడానికి కారణం మహేష్ బాబు అని ఫిలిం సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది. మహేష్ అతడు ముందు వరకూ పెద్ద స్టార్ కాదు. అతడు హిట్ తోనే మార్కెట్ మెరుగు పడింది. ఆ సినిమా తర్వాతే పూరి పొకిరి తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.
దీంతో మహేష్ ఇమేజ్ ఒక్కసారిగా స్కైని టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా మూడు పరాజయాలు ఎదురైనా పోకిరి సక్సెస్ ముందు ఆ ప్లాప్ లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ వెంటనే దూకుడుతో మరో భారీ సక్సెస్ వచ్చింది. అటుపై పూరి బిజినెస్ మెన్ తెరకెక్కించాడు. అప్పటి నుంచి మహేష్ కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోతుంది. పరాజయాలు వచ్చినా మహేష్ మార్కెట్ ముందు నిలబడలేకపోయాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పూరి ఆ డైలాగ్ వదిలి ఉంటాడని అంటున్నారు. దర్శకులను ఉద్దేశించి అనుకున్నా….ఆ డైలాగ్ అందరికీ సరితూగేదేనని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకోవడం విశేషం.