పూరి డైరక్షన్ లో మోక్షజ్ఞ..?

-

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర తెరంగేట్రం కొన్నాళ్లుగా నడుస్తున్న హాట్ న్యూస్. అసలైతే లెజెండ్ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కావాల్సి ఉన్నా ఆ సినిమాలో చిన్న పాత్రే అని వద్దనేశాడు బాలకృష్ణ. శాతకర్ణిలో కూడా ఛాన్స్ వచ్చినా వద్దన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కూడా మోక్షజ్ఞ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

క్రిష్, బోయపాటి, కొరటాల శివ ముగ్గురిలో ఒకరు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తారని అంటుండగా తాజాగా ఆ లిస్ట్ లో చేరాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్. కొన్నాళ్లుగా హిట్ కోసం సతమతమవుతున్న పూరి చేతుల్లో మోక్షజ్ఞని పెడతాడా అని ఆశ్చర్యపోవచ్చు. పైసా వసూల్ సినిమాతో బాలయ్యకు దగ్గరైన పూరి, మోక్షజ్ఞ కోసం ఓ అద్భుతమైన లైన్ వినిపించాడట. ఈమధ్య డెవలప్ చేసిన ఆ కథ విన్న బాలకృష్ణ అదిరిపోయిందని అన్నాడట.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ పూరి డైరక్షన్ లోనే చిరుత సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ సెంటిమెంట్ ప్రకారంగా మోక్షజ్ఞ ఎంట్రీ పూరి డైరక్షన్ లోనే పర్ఫెక్ట్ అని భావిస్తున్నాడట బాలకృష్ణ. త్వరలోనే ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ యూఎస్ లో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news