హాలీవుడ్ చరిత్రలో ఓ వెలుగు వెలిగిన స్పైడర్ మేన్, ఎక్స్ మేన్, ఐరన్ మేన్ సృష్టికర్త స్టాన్ లీ కన్నుమూశారు. కామిక్ సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టించిన స్టాన్ లీ ఎన్నో కామిక్ పాత్రలతో ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. 1922 డిసెంబర్ 28న జన్మించిన స్టాన్ లీ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారట. మార్వెల్ సంస్థలో చేరిన తర్వాత స్టాన్ లీ ఎన్నో కామిక్ క్యారక్టర్స్ సృష్టించడం జరిగింది. అందులో ప్రపంచమంతా విస్తుపోయేలా స్పైడర్ మేన్, సూపర్ మేన్ ఉండటం విశేషం.
1961లో మార్వెల్ కామిక్స్ లో చేరిన స్టాన్ లీ మొదటి ప్రయత్నంగా ఫెంటాస్టిక్ ఫోర్ ను డిజైన్ చేశారు. ఆ తర్వాత స్పైడర్ మేన్, ఇంక్రెడిబుల్ హల్క్, ఐరన్ మేన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా వంటి పాత్రలను సృష్టించడం జరిగింది. హాలీవుడ్ లో స్టాన్ లీకు ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్ అన్న బిరుదు కూడా ఉంది.
స్టాన్ లీ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం ప్రకటించారు. 95 ఏళ్ల వయసు కలిగిన స్టాన్ లీ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన శారీకంగా మన మధ్యన లేకున్నా ఆయన సృష్టించిన పాత్రలు ఎప్పటికి మనకు ఆయన్ని గుర్తుచేస్తూ ఉంటాయని మాత్రం చెప్పొచ్చు.