జనసేన అధినేత పవన్ కల్యాణ్… ‘జనసేన ప్రవాస గర్జన’పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలు సభలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) డల్లాస్‌లో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ‘సత్యాగ్రహి’సినిమా గురించి ప్రస్తావిస్తూ… ఆ సినిమాలో చేయబోయేది నిజజీవితంలో చేయడానికే ‘సత్యాగ్రహి’ని ఆపేశానని వివరించారు. సినిమాల్లో పోరాటులు చేస్తే పరిష్కారాలు దొరకవు. నిజ జీవితంలోకి వచ్చి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను.
అందుకే ఆ సినిమాను ఆపేశా అన్నారు.‘సత్యాగ్రహి’ పోస్టర్‌లో కూడా లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఫొటో ఒకవైపు ఉంటుంది.. మరోవైపు చెగువేరా ఫొటోగ్రాఫ్ ఉంటుంది’ అని పవన్ చెప్పారు. ‘వయసున్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు.. ఓ 25 సంవత్సరాల నా జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాను. అందుకే 2014లో పార్టీని స్థాపించానన్నారు. సమాజంలో రోజురోజుకి పెరిగిపోతున్న అవినీతి, దోపిడినీ చూస్తూ ఉండబట్టలేక రాజకీయ పార్టీ తో సేవ చేయాలని జనసేనను ఎంచుకున్నట్లు వివరించారు.