ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2..!

-

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేసేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా తాజాగా ఆడియో హక్కులను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు విడుదలయ్యే అన్ని భాషలలో కూడా ఈ సినిమా ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ ఏకంగా రూ. 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.. ఇకపోతే ఇంత రేంజిలో అమ్ముడుపోవడం చూసి ఇది ఆల్ టైం హిట్ రికార్డుగా అప్పుడే చెప్పేస్తున్నారు. అంతేకాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆడియో హక్కులను కేవలం రూ.30 కోట్లకు మాత్రమే అమ్ముకుంది.

కానీ ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఇలా ఏకంగా రూ.60 కోట్లకు అమ్ముడుపోవడంతో ప్రతి ఒక్కరు కూడా సినిమా విడుదలకు ముందే రికార్డు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆడియో హక్కులకు ఇంత క్రేజ్ రావడానికి కారణం దేవిశ్రీప్రసాద్ , సుకుమార్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా హైలెట్ గా నిలుస్తూ వచ్చింది.

అందుకే సుకుమార్ ఆలోచనలకు తగ్గట్టుగా సన్నివేశాన్ని హైలైట్ చేస్తూ మ్యూజిక్ ను అందిస్తున్నారు దేవిశ్రీప్రసాద్. ఇక వారి కష్టానిక తగిన ఫలితం ఈరోజు లభించింది అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా ఆడియో హక్కులు ఇంతవరకు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరొకవైపు ఈ సినిమా విడుదలయితే ఖచ్చితంగా కోట్లు కొల్లగొడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news