’ పుష్ఫ’ మూవీకి అరుదైన గౌరవం.. మూవీ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక

-

పుష్ప ది రైస్ భారతదేశ చిత్ర సీమలో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఓ లోకల్ స్టోరీ ప్యాన్ ఇండియా  లెవల్లో అందరికి నచ్చింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో సినిమా భారీ సక్సెస్ అయింది. ఎక్కడ చూసిన పుష్ఫ మేనరిజంతో నెటిజెన్లు తెగ రీల్లు క్రియేట్ చేశారు. దేశంలోని రాజకీయ నాయకులు, క్రికెటర్ల నుంచి పుష్ప డైలాగులు, డ్యాన్సులు చూశాం. అంతలా దేశంలో తన సత్తాను చాటింది తెలుగు సినిమా. వందల కోట్లను కలెక్ట్ చేసింది. బన్నీ యాక్టింగ్ కు అంతా ఫిదా అయిపోయారు. పుష్ప కలెక్షన్లను చూసి బాలీవుడ్ ముక్కున వేలేసుకుంది. ఓ తెలుగు, ప్రాంతీయ సినిమా చేసిన రికార్డ్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు మారాల్సిన అవసరం ఉందంటూ.. అక్కడి క్రిటిక్స్ పుష్పపై తెగ ప్రశంసలు కురిపించారు. 

ఇదిలా ఉంటే ‘ పుష్ప’ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్ 2022’ కు గానూ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఉత్తమ నటుడిగా ‘83’ సినిమాకు గానూ… రణ్ బీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డ్ ని గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా ‘మిమి’ సినిమాకు గానూ.. క్రుతి సనన్ ఉత్తమ నటి అవార్డ్ గెలుచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news