పుష్ప: అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా అంత కీలకమా..?

-

సినీ ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో హీరో అల్లు అర్జున్ కూడ ఒకరిని చెప్పవచ్చు.. 2003 వ సంవత్సరంలో వచ్చిన గంగోత్రి సినిమాతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలో నటించి అగ్ర హీరోల స్థానంలో చోటు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇండస్ట్రీలోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగులో అంతటి పాపులారిటీ సంపాదించుకున్న సినిమాగా పేరుపొందిన అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా భారీ కలెక్షన్లను రాబట్టి పలు సంచలనాన్ని సృష్టించింది. అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా బాలీవుడ్ వైపు కూడా పాకిపోయిందని చెప్పవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఉన్న నేపథ్యం కథ చిత్రంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప సినిమా ఒక మైలురాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని తాజాగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.

పుష్ప సినిమా తర్వాత తన కెరియర్ లో ఎన్నో మార్పులు వచ్చాయని తెలియజేశారు. పుష్ప చిత్రం ఈ రేంజ్ లు విజయాన్ని అందుకుంటుందని అసలు అనుకోలేదని ఈ విషయం మాత్రం తనని ఆశ్చర్య కలిగించిందని తెలియజేశారు. ఒకవేళ తన కెరీర్ లో పుష్ప చిత్రం లేకపోతే ఇంతమంది అభిమానులు ఇంత ప్రేమను నేను సంపాదించుకోలేనేమో.. ఒకవేళ సంపాదించుకునేకి ఎన్ని సంవత్సరాలు పట్టేదో చెప్పలేనని తెలిపారు. పుష్ప -2 సినిమా సీక్వెల్ ఆ అంచనాలకు అనుగుణంగానే తెరకెక్కిస్తూ ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news