రష్యాలో ఐకాన్ స్టార్ హవా.. ‘పుష్ప’ సినిమా విడుదలకు సన్నాహాలు

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరూ ఊహించనంత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఓటీటీలోనూ విడుదలై చాలా రోజులైనా ఇప్పటికీ దీని హవా సాగుతోంది.

ఇటీవల ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన చిత్రాల కేటగిరిలో పుష్ప తెలుగు వర్షన్‌ సినిమాను ఇంగ్లిషు, రష్యన్‌ సబ్‌ టైటిల్స్‌తో ప్రదర్శించడం విశేషం. అతి త్వరలో ఈ సినిమా రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమాను మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో డబ్‌ చేశారు. అల్లుఅర్జున్‌ పాపులర్‌ డాన్స్‌ నంబర్‌ అయిన ‘శ్రీవల్లి’ పాటతో పాటు సమంతా నటించిన ‘‘ఊ అంటావా ఊఊ అంటావా’’ పాటలు సోషల్‌మీడియాను హోరెత్తించాయి.

Read more RELATED
Recommended to you

Latest news