బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘పుష్ప2’ క్రేజీ అప్‌డేట్‌ వచ్చేస్తోంది

-

వచ్చేస్తోంది.. ఎప్పుడెప్పుడా అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్న బన్నీ.. పుష్ప 2కు సంబంధించిన అప్డేట్ కోసం యావత్ భారత ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లోనే దుమ్మురేపి.. బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన అల్లు అర్జున్.. సెకండాఫ్ లో ఏం చేయబోతున్నాడని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం ‘పుష్ప: ది రూల్‌’. రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రేపు ఉదయం 11.07గంటలకు ‘పుష్ప2’ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకోనున్నారు.

ఏప్రిల్‌8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌, కాన్సెప్ట్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట కాన్సెప్ట్‌ టీజర్‌ విడుదల చేసి, ఆ తర్వాత పుట్టినరోజు నాడు ఫస్ట్‌లుక్‌ అభిమానులతో పంచుకోనున్నారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు కొనసాగింపుగా సుకుమార్‌ తాజా మూవీని తీర్చిదిద్దుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news