టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై స్పందించిన రాశీ ఖన్నా.. ఏమన్నదంటే?

-

ఊహలు గుసగుసలాడే.. అంటూ తెలుగు తెరకు పరిచయమయిన బాలీవుడ్ భామ రాశీ ఖన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. మధ్యలో ఆమె నటించిన సినిమాలు హిట్ కొట్టకపోయినా… ఆమెకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

Raasi Khanna responds on harassment in Telugu industry

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో లైంగిక వేధింపుల అంశం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే కదా. చాలామంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెట్టారు. నిర్భయంగా బయటికి వచ్చారు. అయితే.. లైంగిక వేధింపులపై రాశీ ఖన్నా కూడా తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులపై మాట్లాడిన రాశీ ఖన్నా.. లైంగిక వేధింపులకు గురైన వారు అందరి ముందుకు వచ్చి దైర్యంగా చెప్పడం గ్రేట్ అని.. వాళ్లను అభినందించాలని చెబుతూ… మీటూ అంటూ చెప్పడానికి నాకు ఏదీ లేదంటోంది రాశీ.

తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి చెడు అనుభవాలు ఎదురు కాలేదు. టాలీవుడ్ ఈజ్ వన్నాఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీస్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇక్కడ మహిళలను గౌరవిస్తారు. కాకపోతే.. ఇక్కడ వేధింపులు లేవు అని నేనైతే చెప్పలేను. కానీ.. నేను మాత్రం ఎటువంటి లైంగిక వేధింపులకు గురి కాలేదు.. అంటూ చెప్పుకచ్చింది రాశీ ఖన్నా.

Read more RELATED
Recommended to you

Latest news