Rajamouli.. దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా తన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడమే కాదు గ్లోబల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విషయం తెలిసిందే .ఇకపోతే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసి జపాన్ దేశం లో కూడా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించడం మన దేశానికి గర్వకారణం అని చెప్పాలి.
వరుసగా సంచలన విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు రాజమౌళి. ముఖ్యంగా భారతదేశంలో నంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే అందరూ వెంటనే బాలీవుడ్ దర్శకుల వైపు చూసే వాళ్ళు లేదా శంకర్ అని చెప్పేవాళ్ళు.. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది నేనున్నాను అంటూ కొన్నేళ్లుగా కదలకుండా ఆ స్థానంలోకే వచ్చేసారు రాజమౌళి.. ఇప్పుడు తెలుగు సినిమా మొదలై ఈయన ప్రస్థానం ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఒక్కో సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టించే స్థాయికి చేరిపోయాడు మన జక్కన్న.
ఇకపోతే ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ సినిమాకు సంబంధించిన విషయాలను పనులను చక్కబెడుతూనే ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోని తాజాగా ఒక ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు రాజమౌళి. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలలో తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అందులో భాగంగానే రోడ్డు ట్రిప్ చేస్తూ తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ సందర్భంగా జూన్ చివరి వారం శ్రీ రంగం, బృహదీశ్వరాలయం , మధురై, తూత్తుకూడి, కనడుకథన్ వంటి దేవాలయాలను సందర్శించామంటూ తెలిపారు. అంతేకాదు తన కల కూడా నెరవేరిందని తెలిపారు.
Wanted to do a road trip in central Tamilnadu for a long time. Thanks to my daughter who wanted to visit temples, we embarked upon it. Had been to Srirangam, Darasuram, Brihadeeswarar koil, Rameshwaram, Kanadukathan, Thoothukudi and Madurai in the last week of June . Could only… pic.twitter.com/rW52uVJGk2
— rajamouli ss (@ssrajamouli) July 11, 2023