జపాన్‌ విమానాల్లో అదిరిపోయే ఫీచర్‌..

-

జపాన్ ఎయిర్‌లైన్స్ ఒక విప్లవాత్మక క్రొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. సాధార‌ణంగా బ‌స్సులోనో లేదా రైళ్లోనో పిల్ల‌లు ఏడుస్తుంటే కొంద‌రు ఇబ్బందిగా.. ఇరిటేష‌న్‌గా ఫీల్ అవుతుంటారు. అదే విమానాల్లో అయితే ప్రయాణికులు మ‌రింత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఈ క్ర‌మంలోనే జ‌పాన్ విమానాల్లో స‌రికొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. టిక్కెట్‌ బుకింగ్‌ అప్పుడు రెండేళ్ల లోపు పిల్లలు ఏ వరుసలో, ఏ సీటులో కూర్చున్నారో తెలియజేస్తూ ఓ పిల్లల ఐకాన్‌ కనిపిస్తుంది.

దాంతో ఆ సీటును వదిలేసి ఖాళిగా ఉన్న సీట్లలో మనం ఎక్కడ కూర్చోవాలో ముందుగానే నిర్ణయించుకొని టిక్కెట్‌ బుక్‌చేసుకోవచ్చు. అందుకు ‘సీట్‌ అరెంజ్‌మెంట్‌’ చార్ట్‌ ఉపయోగపడుతుంది. అలాగే ఎనిమిది రోజుల బేబీ నుంచి రెండేళ్ల లోపు బేబీలను తీసుకొచ్చే ప్రయాణికులు కూడా ‘బేబీ ఐకాన్‌’ చూపిన సీటునే ముందుగా బుక్‌ చేసుకోవాలి. నిశ్శబ్ద విమాన ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణీకులు తమ సీటు వీలైనంత దూరంలో ముందుగానే నిర్ధారించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news