సినిమా పరిశ్రమలో క్లారిటీ ఉండే దర్శకులు చాలా తక్కువ మందే ఉంటారు. నటీనటుల నుంచి గానీ, టెక్నీషియన్ల నుంచి గానీ ఏం రాబట్టుకోవాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. రాజమౌళికి ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. అందుకే రాజమౌళికి ఎలాంటి కథలు ఎంచుకోవాలా ? సినిమా ఎలా ? తీయాలో బాగా తెలుసు. అందుకే రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా తీయలేదు. బాహుబలి 1,2 సినిమా విజయం తర్వాత రాజమౌళి రేంజ్ పూర్తి గా మారిపోయింది.
ఇప్పుడు రాజమౌళి నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – చరణ్‌తో ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా రెండో ?డ్యూల్‌కు రెడీ అవుతున్నారు. ఇక రాజమౌళి సినిమాల్లో లాగ్, సాగదీతకు స్కోప్ ఉండదు. ఏ సీన్ ఎంత ? తీయాలన్నదానిపై పక్కా క్లారిటీ ఉంటుంది.
ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని కూడా రెండున్నర గంటల నిడివిలోపే తీసేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాహుబలి కథ చాలా పెద్దగా ఉండడంతో రెండు భాగాల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం కేవలం రెండున్నర గంటల్లో లాగ్ లేకుండా ఒకే సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యాడట. ఇదే జరిగితే రాజమౌళి పెద్ద సర్‌ఫ్రైజ్ ఇచ్చినట్టే.
అంత తక్కువ నిడివి లో రాజమౌళి ఇప్పటి వరకు ఏ సినిమా ని కూడా పూర్తి చేయలేదు.