లెట‌ర్ లీక్‌పై స్పందించిన ర‌జ‌నీ

-

తాను క్రీయాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నాని, అయితే త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ అందిరిలా వుండ‌ద‌ని ర‌జ‌నీ కాంత్ చెప్పిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం త‌ను రాజ‌కీయాల్లోకి రాబోతున్నాన‌ని ర‌జ‌నీ ప్ర‌క‌టించారు. కానీ ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. పార్టీకి సంబంధించిన ఎలాంటి క‌ద‌లిక లేదు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవచ్చు అని తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రాజకీయాల్లోకి రాకముందే నిష్క్రిమించే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయంటూ చేతితో రాసిన నోట్ తమిళనాడులో ఈ రోజు వైరల్ అయ్యింది.

ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి రజనీకాంత్ ఈ రోజు సోషల్ మీడియాలో స్పందించారు. త‌న పేరుతో వైర‌ల్ అవుతున్న లెట‌ర్ నకిలీ అని పేర్కొన్నారు. తాను అలాంటి నోట్ రాయలేదని పేర్కొన్నారు. అయితే, తన ఆరోగ్య పరిస్థితి గురించి వార్తాకథనాలు నిజమని ఆయన అంగీకరించారు. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న లేఖ త‌ను రాసింది కాద‌ని అయితే అందులో త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌చ్చిన వార్త నిజ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. దీని గురించి మక్కల్ మండ్రం బృందంతో చర్చిస్తాను. రాజకీయాలపై నా వైఖరి గురించి తగిన సమయంలో ప్రజలకు తెలియజేస్తాను`అని తమిళంలో ట్వీట్ చేశారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆయ‌న‌ని వైద్యులు ఆరోగ్య పరిస్థితిని బట్టి బహిరంగ ప్రదేశంలోకి వెళ్ల‌రాద‌ని, అలాగే సామూహిక కార్య‌క్ర‌మాలు జ‌రిగే చోట ప్రజలతో సంపూర్ణ దూరం పాటించాల‌ని సూచించార‌ట‌. గ‌తంలో ర‌జ‌నీ అనారోగ్యానికి గురికావ‌డంతో ఆయ‌న‌కు సింగ‌పూర్‌లో వైద్యం చేయించారు. ఆ కార‌ణాల దృష్ట్యా ర‌జ‌నీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కానీ సామూహిక కార్య‌క్ర‌మాల‌కు కొంత కాలం దూరంగా వుండాల‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్టు తెలుస్తోంది. దీన్ని బ‌ట్టి ర‌జ‌నీ పార్టీని ప్రారంభించే అవ‌కాశాలు ఏమాత్రం క‌నిపించ‌డం లేద‌ని త‌మిళ‌నాట జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news