అఫీషియల్: రజనీకాంత్ 169వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది..సూపర్ స్టార్ ఫిల్మ్ టైటిల్ ఇదే..

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమా అప్ డేట్ వచ్చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ కు మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా అప్ డేట్ ను తాజాగా మేకర్స్ ఇచ్చేశారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సదరు పోస్టర్ లో పెద్దగా, పొడవుగా ఉండే కత్తిని వేలాడదీయగా, ఆ కత్తికి నెత్తురు అంటుకుని ఉంది. ఈ పోస్టర్ ద్వారా సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని దర్శకుడు చెప్పకనే చెప్పారు.

రజనీకాంత్ గత చిత్రం ‘అన్నాత్తె’ (తెలుగులో ‘పెద్దన్న’) అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమా తలైవా-నెల్సన్ దిలీప్ కాంబో ‘జైలర్’..డెఫినెట్ గా హిట్ కావాలని అభిమానులు కోరుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ పేరుతో విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ పిక్చర్ లో రజనీకాంత్..డిఫరెంట్ అవతార్ లో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news