రైళ్ల పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వలేం.. వీరికి అమౌంట్ రీఫండ్ చేస్తాం: CPRO

-

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మరికొందరు పలు చోట్ల రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో రైల్వే భోగీలు, రైలు పట్టాలు, ఫర్నీచర్లు ధ్వంసం అయ్యాయి. తాజాగా ఈ ఆందోళన వేడి తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆందోళనలు జరిగాయి. దీంతో మెట్రో, ఎంఎంటీఎస్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను దక్షిణ మధ్య రైల్వేశాఖ రద్దు చేసింది.

సికింద్రాబాద్-అల్లర్లు
సికింద్రాబాద్-అల్లర్లు

ఈ క్రమంలో రైల్వే సీపీఆర్ఓ రాకేష్ సికింద్రాబాద్ ఘటనపై స్పందించారు. రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. స్టేషన్‌లోకి నిరసనకారులు ఎలా వచ్చారనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. దీనికి కారణమైన ప్రతిఒక్కరిని శిక్షిస్తామన్నారు. ఎమర్జెన్సీ కంట్రోల్ యాక్షన్ ప్లాన్ ద్వారా పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.

ఇప్పటివరకు మొత్తం 77 రైళ్లు రద్దు చేశామని, 6 ఎక్స్ ప్రెస్, 55 ఎంఎంటీఎస్ రైళ్లు, 6 రైళ్లు పాక్షికంగా రద్దు చేశామన్నారు. రైళ్ల పునరుద్ధరణకు సమయం పడుతుందని, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరిగి వారి అకౌంట్‌లోనే అమౌంట్ రీఫండ్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news