ఇది కదా కావాల్సింది.. రజిని పేటా టీజర్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

-

సూపర్ స్టార్ రజినికాత్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న పేటా మూవీ టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నెట్ వర్క్ నిర్మిస్తున్నారు. సినిమాలో రజిని డ్యుయల్ రోల్ చేస్తారని తెలుస్తుంది. సిమ్రన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ రజిని స్టైల్ ఆఫ్ వాకింగ్ తో రిలీజ్ చేశారు.

జస్ట్ అలా నడిచి వచ్చే రజినిని చూపించినా ఆయన మార్క్ స్టైల్.. హావభావాలతో ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేశాడు రజినికాంత్. ఇక ఈ పేటా మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అన్నదాని మీద క్లారిటీ రాలేదు. కార్తిక్ సుబ్బరాజు రజిని ఇమేజ్ కు తగినట్టుగా సినిమా తెరకెక్కించాడని ఈ టీజర్ చూస్తేనే సరిపోతుంది. అయితే టీజర్ లో రజిని డైలాగ్ మాత్రం చెప్పలేదు.

2.ఓ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా రజిని పేటా రిలీజ్ కు రెడీ అవుతుంది. 2019 సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఇప్పటికే సంక్రాంతి క్యాలెండర్ ఫుల్ అయ్యింది. అయినా సరే రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news