విజయవాడ: పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చినట్లుగా..లోక్‌సత్తా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా జేడీ లక్ష్మీనారాయణ వచ్చారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నియమాల గురించి మాట్లాడే లోక్‌సత్తా నాయకులు.. ఈ నాలున్నరేళ్ల చంద్రబాబు అవినీతిపై, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ తదిరత అంశాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలల్లో ఒకటి లోక్‌సత్తా పార్టీ కాగా, మరొకటి జనసేత పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అనేసరికే చంద్రబాబుకు అన్ని పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పట్టిసీమ నుంచి రాయలసీమ వరకూ అణువణువు దోచుకున్నారని ఆరోపించారు.