ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓంకార్ నిర్మించిన రాజుగారి గది 3 సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఆంధ్ర – తెలంగాణలో మొదటి రెండు రోజులకంటే మించి మూడవ రోజు కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రు. 5 కోట్లకు అమ్మారు.
ఇప్పుడు ఈ సినిమా మూడు రోజుల్లోనే రు 3.69 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. అంటే ఫస్ట్ వీకెండ్లోనే ఏకంగా 70 శాతం రికవరీ చేసింది. మార్కెట్లో సైరా స్లో అవ్వడం… పోటీ సినిమాలు లేకపోవడం రాజుగారి గది 3కు కలిసొచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగియడంతో ఇప్పుడు సోమవారం వీక్ డేస్ నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష ప్రారంభమవుతుంది.
వీక్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకున్నా డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు. మూడో రోజు ఈ సినిమా ఏకంగా తొలి రెండు రోజుల కంటే ఎక్కువుగా రు 1.40 కోట్ల షేర్ రాబట్టింది. అత్యధికంగా నైజాంలో రు.85 లక్షలతో కోటికి దగ్గర్లో ఉంది. అటు ఓవర్సీస్‌లో మరో రు.12 లక్షలు రాబట్టి… ఓవరాల్‌గా మూడు రోజులకు రు 3.81 కోట్ల షేర్ రాబట్టింది.