బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్ పైన కాన్సంట్రేట్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో దాదాపుగా యాక్ట్ చేసిన ఈ భామ..ప్రస్తుతం బీ టౌన్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా గులాబీ రంగు డ్రెస్సు‘ పింక్ పాంథర్’లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు హీరోయిన్ కు ‘ఐ లవ్ యూ’ చెప్తున్నారు. ‘వావ్, లుకింగ్ బ్యూటిఫుల్, హాట్ ’ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
గులాబీ రంగు టాప్, ప్యాంట్ ధరించి అలా జేబులో చేతులు పెట్టుకుని సూపర్ స్టైలిష్ గా కనబడుతోంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ఈ ఫొటోల్లో అలా ఓరగా చూస్తూ, చూపులతోనే కొంటెగా కవ్విస్తున్నట్లు ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ భామ నటించిన ‘రన్ వే 34’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించడంతో పాటు లీడ్ రోల్ ప్లే చేయగా, కీలక పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు.
https://www.instagram.com/p/CcsdijaPFvH/?utm_source=ig_web_copy_link