ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు నిన్నటి రోజున రామ్ చరణ్ ఆఫీస్ ముంగిట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ సినిమా కథ మొత్తం తీసుకొని తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇటీవల సైరా’ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి కాలిపోయిన వస్తువులన్నీ తమవేనని ఆగ్రహం చెందారు. ఆ సమంలో రామ్‌చరణ్‌ను కలిస్తే, చాలా చక్కగా మాట్లాడారని. కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల న్యాయం చేస్తానని మాట ఇచ్చారని తెలిపారు. కానీ నిన్నటి రోజున రామ్ చరణ్ మేనేజర్ నుంచి సమాధానం మరోలా వచ్చిందని..ఇక కలవాల్సిన పనిలేదని ర్యాష్ గా మాట్లాడినట్లు వాపోయారు. మధ్యలో ఉన్నవారే అందుకు కారకులని ఆరోపించారు.
అయితే ఇలాంటి విషయాలు హీరో వరకూ మేనేజర్లు అంత తొందరగా తీసుకెళ్లరు. మధ్యలో వీళ్ల గేమ్ అనేది ఉంటుంది. చరణ్ అనే కాదు. ప్రతీ హీరో మేనేజర్ ఇలాంటి వేషాలు వేస్తుంటారు. హీరోలనే ముంచిన మేనేజర్లను చూసాం. అయితే తాజాగా ఈ ఘటన గురించి చరణ్ కు మేనేజర్ ద్వారా కాకుండా బయట వ్యక్తుల ద్వారా తెలిసిందిట. దీంతో చరణ్ మేనేజర్ పై సీరియస్ అయ్యాడని మెగా సన్నిహిత వర్గాల నుంచి కొద్ది సేపటి క్రితమే తెలిసింది. ఉయ్యాల వాడ వంశీయులు ఆఫీస్ కు వచ్చిన విషయం తనకెందుకు తెలియజేయలేదని సీరియస్ అయ్యాడుట. ఎంతో దూరం నుంచి వచ్చుంటారు? కనీస సంస్కారం లేదా? మనుషులతో మాట్లాడే విధానం అదేనా? అంటూ చెడా మడా తిట్టేసాడుట.
ఆ క్షణంలో తన కళ్ల ముందు కనిపించొద్దని గెటౌట్ అన్నాడుట. దీంతో ఆ మేనేజర్ ఉద్యోగం ఉడినట్లేనని కాంపౌండ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అతని స్థానంలో కొత్త వారిని అపాయింట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మెగా కాంపౌండ్ లో ఉద్యోగం చేసే వారిని ఎంత పెద్ద తప్పు చేసినా స్ర్టెయిగ్ పొమ్మని అనరని అంటారు. ఎలాంటి పనులు చెప్పకుండా నెల అయ్యే సరికి జీతం ఇచ్చి పరోక్షంగా హింట్ ఇస్తారని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. అక్కర్లేని పెత్తనం చేస్తే అలాగే ఉంటుంది మరి.