రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో నిన్న ఒక ఫొటో పెట్టింది. అది పాతదే అయినప్పటికీ ఇప్పుడు ఆ ఫొటో వల్ల ఆమె అందరిచే విమర్శలను ఎదుర్కొంటోంది.
చెన్నై నగరంలో ప్రస్తుతం నీటి కోసం జనాలు ఎన్ని అవస్థలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. నిత్యావసరాలకే కాక, తాగునీటికీ అక్కడ కటకట నెలకొంది. దీంతో ప్రస్తుతం అక్కడ జనాలు నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు అక్కడి కంపెనీల్లో చాలా వరకు ఉద్యోగులకు తమ నీటిని తామే తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే.. ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మాత్రం స్విమ్మింగ్ పూల్‌లో తన కుమారుడు వేద్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసి అందరిచే విమర్శలను ఎదుర్కొంటోంది.
రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో నిన్న ఒక ఫొటో పెట్టింది. అది పాతదే అయినప్పటికీ ఇప్పుడు ఆ ఫొటో వల్ల ఆమె అందరిచే విమర్శలను ఎదుర్కొంటోంది. తన కుమారుడు వేద్‌తో కలిసి పూల్‌లో స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. అది చాలా పాతది. అయినా.. ప్రస్తుతం చెన్నై నగరంలో ఉన్న నీటి ఎద్దడి దృష్ట్యా ఆమె అలా ఆ ఫొటోను షేర్ చేయడం నెటిజన్లకు ఆగ్రహాన్నితెప్పించింది. అయితే అది పాత ఫొటో అని తెలియని కొందరు మాత్రం.. ఓ వైపు తాము నీటి సమస్యతో అల్లాడిపోతుంటే నువ్వు ఇలా స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్నావా..? అంటూ సౌందర్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Removed the pictures shared in good spirit from my #TravelDiaries considering the sensitivity around the current #WaterScarcity we are facing ??. The throwback pics were to emphasise the importance for physical activities for children from a young age only ??? #LetsSaveWater
— soundarya rajnikanth (@soundaryaarajni) June 30, 2019
అయితే సోషల్ మీడియాలో నెటిజెన్ల విమర్శల తాకిడి ఎక్కువ కావడంతో స్పందించిన సౌందర్య ఆ ఫొటోను డిలీట్ చేసింది. అలాగే ఈ ఫొటోపై తన ట్విట్టర్ పోస్టులో వివరణ ఇచ్చుకుంది. అది చాలా పాత ఫొటో అని, పిల్లల్లో కేవలం చదువులే కాక, శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉందని చాటి చెప్పేందుకే తాను ఆ ఫొటోను పోస్ట్ చేశానని, అంతేకానీ.. ప్రజలను ఇబ్బంది పెట్టడం తనకు ఎంత మాత్రం ఇష్టంలేదని, ప్రస్తుతం ఉన్న నీటి సమస్య దృష్ట్యా ప్రజల మనోభావాలను కించపరచకుండా ఉండేందుకే తాను ఫొటోను డిలీట్ చేస్తున్నానని ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే సౌందర్య కేవలం ఇదే కాదు, ఎప్పటికప్పుడు తన కుమారుడికి చెందిన ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఈ ఫొటో వైరల్ కావడంతో సౌందర్య ప్రజలకు క్షమాపణ చెప్పక తప్పలేదు..!