కొరటాల శివపై ఫైర్ అవుతున్న రామ్ చ‌ర‌ణ్‌.. అందుకేనా..?

-

సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొరటాల శివతో ప‌ట్టాలెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కొరటాల శివ సినిమా అంటేనే అందులో కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అలాంటిదే అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన ఆచార్య అనే వ్యక్తి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని టాక్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది.

ఇక ఈ సినిమాలో చరణ్ కూడా న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో రామ్ చరణ్ కొర‌టాల‌పై ఫైర్‌ అయినట్లు తెలుస్తుంది. కొరటాల శివ చిత్రంలో తన షూటింగ్ చిత్రీకరణ పూర్తయితే పూర్తీ స్థాయిలో ఆర్ ఆర్ అర్ ఫై శ్రద్ధ చూపించాలని భావిస్తున్నారట. రామ్ చరణ్ చాల గ్యాప్ తీసుకొని రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనుండటం తో ఈ చిత్రం ఫై భారి అంచనాలే నెలకొన్నాయి. మ‌రోవైపు మొదటిసారి కొరటాల శివ తో కూడా రామ్ చరణ్ పని చేస్తున్నారు. ఇలా రెండు భారీ బడ్జెట్ చిత్రాలతో రామ్ చరణ్ బిజీగా గడిపేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news