ఆర్ ఆర్ ఆర్: చరణ్ చేతిలో అరుదైన రికార్డు..

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలిసిందే. ఇటీవల రిలీజైన ఎన్టీఆర్ టీజర్ కి వచ్చిన స్పందన చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోయింది. విడుదలైన అన్ని భాషల్లోనూ రెస్పాన్స్ ఒకేలాగా ఉంది. ఐతే ఈ టీజర్ కి 1మిలియన్ లైకులు రావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ టీజర్ సరికొత్త రికార్డుని అందుకుంది. భీమ్ ఫర్ రామరాజు గా వచ్చిన ఈ టీజర్ కి 33.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

దీంతో టాలీవుడ్ లోనే ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా రికార్డు దక్కించుకుంది. అంతకుముందు ఈ రికార్డు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట ఉండేది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర టీజర్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. మరి ఇప్పుడు రామ్ చరణ్ చేతికి చేరిన ఈ రికార్డుని ఏ హీరో బద్దలు కొడతాడో చూడాలి.