చ‌ర‌ణ్ మేకోవ‌ర్ కిర్రాక్‌ అనాల్సిందే!

-

వెండితెర‌పై మెర‌వాల‌న్నా.. ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకోవాలన్నా.. స్టార్ డ‌మ్‌ని మ‌రింత‌గా పెంచుకోవాల‌న్నా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్ర‌జెన్స్ చాలా ముఖ్యం. దానిపై హీరోలు, హీరోయిన్‌లు ప్ర‌త్యేక దృష్టిని పెడుతుంటారు. అందు త‌గ్గ మేకోవ‌ర్ కోసం భారీగానే ఖ‌ర్చు చేస్తుంటారు. మ‌న మెగా ప‌వ‌ర్‌స్టార్ కూడా ఇదే త‌ర‌హాలో శ్ర‌మించారు. త‌న లుక్‌పై కెరీర్  ప్రారంభంలో ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా సీరియ‌స్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లారు.

`ధృవ‌` మూవీ నుంచి త‌న మేకోవ‌ర్‌ని మ‌రింత ప్ర‌భావ‌వంత‌గా మ‌లుచుకుని మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించారు. ఆ త‌రువాత చేసిన `రంగస్థ‌లం`లో చిట్టిబాబుగా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి ఔరా చ‌ర‌ణేనా అని‌పించారు. తాజాగా త‌న లుక్ విష‌యంలో చ‌ర‌ణ్ మ‌రింత ప‌ర్‌ఫెక్ష‌న్‌ని సాధించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. స్టైలిస్ట్‌ల స‌హాయంతో `ఆర్ ఆర్ ఆర్` కోసం చ‌ర‌ణ్ ఫైన‌ల్‌గా బెస్ట్ లుక్‌లోకి వ‌చ్చారు. ఇదే విష‌యాన్ని ఫెరోషియ‌స్ లుక్ లో క‌నిపిస్తున్న ఓ ఫొటోని షేర్ చేసి స్ప‌ష్టం చేశారు చ‌ర‌ణ్‌. Be the best possible version of yourself అని ఆ ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు. `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ చ‌ర‌ణ్ అల్లురి సీతారామ‌రాజు లుక్‌లోకి మారిపోయారు. చ‌ర‌ణ్ షేర్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో చ‌ర‌ణ్ మేకోవ‌ర్ చూస్తే  కిర్రాక్ లుక్ అనాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news