నక్సలైట్ గా మార‌నున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..?

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో జక్కన్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం వరకూ పూర్తి చేసుకుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత కొరటాల, చిరంజీవి కాంబినేషన్లోని సినిమా కోసం చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చరణ్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరంజీవి పాత్ర యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ పాత్ర ఏమిటా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూపోతోంది. ఆయన ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా ఆ పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి ‘ఆచార్య’అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, కథానాయికగా ‘త్రిష’ పేరు వినిపిస్తోతోంది.