మహేష్ మేనల్లుడి కోసం రాబోతున్న మెగా పవర్ స్టార్ ….!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క, బావలైన గల్లా జయదేవ్ మరియు పద్మావతిల పెద్ద కుమారుడు గల్లా అశోక్ అతి త్వరలో హీరోగా లాంచ్ కాబోతున్నట్లు ఇప్పటికే టాలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన వెలువడింది. భలే మించి రోజు, శమంతకమణి, దేవదాసు సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా జయదేవ్ తొలిసారి సినిమా రంగంలోకి తన అమర్ రాజా ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా నిర్మించబోతున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు జీబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 


ఇకపోతే ఈ సినిమాను అధికారికంగా ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు నిన్న ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు కాసేపటి క్రితం ఆ సినిమా యూనిట్ ఒక న్యూస్ ని రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ఈవెంట్ కి హాజరవుతున్నట్లు సమాచారం. మొదటి నుండి మెగా మరియు ఘట్టమనేని ఫ్యామిలీల మధ్య మంచి అనుబధం ఉందన్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మహేష్ మరియు చరణ్ కూడా వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అవడంతో, ఘట్టమనేని ఫ్యామిలీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు చరణ్ ఈ వేడుకకు విచేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అశోక్ గల్లా నటించబోయే తొలి సినిమాను ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో లాంచ్ చేయడం జరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా ఆగిపోవడంతో, కొన్నాళ్ల తరువాత శ్రీరామ్ ఆదిత్యతో సినిమాను సినిమాను సిద్ధం చేసారు. మరి టాలీవుడ్ కి అతి త్వరలో హీరోగా అడుగుపెడుతున్న ఈ నూతన ఘట్టమనేని వారసుడు ఎంత మేర సక్సెస్ అందుకుంటాడో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news